HomeTelanganaNizamabadతెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యుడిగా సంపత్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యుడిగా సంపత్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నగరానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు సంపత్ ఎంపికయ్యారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన నియామక ఉత్తర్వులను అందజేశారు.

గత కొంతకాలంగా ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్యవైశ్యుల సంక్షేమానికి, వ్యాపార, సామాజిక రంగాల్లో సమాజ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని, అందరినీ కలుపుకుంటూ మహాసభ ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సంపత్ ఎంపిక కావడం పట్ల నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, వివిధ వ్యాపార, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments