కొబ్బరి బొండం తాగడానికి వెళ్లి వచ్చే లోపే కారులో ఉన్న రెండు లక్షల రూపాయల ను మాయం చేసారు. ఈఘటన బాన్స్ వడ శివారు లోని ఇబ్రహీం పట్నం తండా సమీపంలో జరిగింది. తండాకు చెందిన కట్రోత్ చందర్ తండా లోనే కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
రోజువారీ పనిలో భాగంగానే గురువారం తన కారులో బాన్స్ వాడ వచ్చి ఎస్బిఐ బ్యాంకు లో నుంచి రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నడు ఓ వ్యక్తి తన కారులో తీసుకెళ్తున్నాడు మధ్యలో కొబ్బరి బొండం తాగడానికి కారు ఏరియా ఆసుపత్రి ముందు కారు పార్క్ చేసి కొబ్బరి బొండం షాప్ కు వెళ్ళాడు తాగి వచ్చే లోపే కారు లో నుంచి ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైకు మీద చందర్ ను బ్యాంకు నుంచే అనుసరిస్తున్నారు.
ఓ యువకుడు కారు లో నగదు తీయడానికి వెళ్తే మరో యువకుడి బైకు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు ఇద్దరు కలిసి రెండు లక్షల రూపాయల నగదు తో ఉడాయించారు సీసీ కెమెరాల్లో ను ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
