నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్ శివారులో ఆర్టీసీ బస్సు గేదెను ఢీకొట్టిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పెర్కిట్ సమీపంలో రహదారిపై అడ్డుగా ఉన్న గేదెను ఎదురెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంతో బస్సు కొంతసేపు నిలిచిపోయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. గేదె మృతి చెందటంతో రైతు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తగిన నష్టపరిహారం అందించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరుతూ కోరిక పెట్టాడు.
