జాన రమేష్: ఇది సంగతి:ఆర్మూర్:
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు మరో మారు ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. వాయిదా ప్రకారం అద్దె బకాయి చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణ సముదాయ యజమానులు ఆర్టీసీ అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీకి బకాయి ఉన్న 2 కోట్ల 50 లక్షలు అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, లేనియెడల హైకోర్టు ఉత్తర్వుల మేరకు షాపింగ్ కాంప్లెక్స్ సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేస్తూ మైక్ అనౌన్స్మెంట్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణ సముదాయ యజమానులకు ఆర్టీసీ అధికారులతో చర్చించి అగ్రిమెంట్ దిశగా మాట్లాడుకోవాలని సూచించారు .