- రోడ్డుపై బైఠాయించి నిరసన
- ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ ;
బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ. 500/- బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని రైతులు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆర్మూర్ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…
వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం,.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని వంచిందన్నారు.
మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ నియోజకవర్గ రైతులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన గా రాస్తారోకోను నిర్వహించారు.
రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ లకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు