మేడిపండు చూడు అనే నానుడి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఆసుపత్రి కి అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. వైద్య సేవల్లో తాము రాష్ట్ర స్థాయిలో భేష్ అంటూ గప్పాలు కొట్టే అధికారులు ఈ ఆసుపత్రిలో ఏ విభాగంలో సాంకేతిక లోపాలు వచ్చిన బాగు చేసే విషయంలో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే రోగులకు వైద్యం చేసే విషయంలో చేతులెత్తేస్తున్నారు.
ఆసుపత్రిలో అత్యంత కీలకంగా ఉండే ఆర్థో విభాగంలో పూర్తీ స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. గత కొన్ని రోజులుగా ఆర్థో విభాగం ను మూసేసారు. పైకి మరమత్తులు అని చెప్తున్నప్పటికీ ఆ విభాగం లో ఓ మిషన్ ను కూడా పనిచేయడం లేదు.
టైల్స్ వేస్తుండడంతో ఈ విభాగంను మరో బ్లాక్ లోకి మార్చారు. కానీ ఆపరేషన్ థియేటర్ లో ఉండే ముఖ్యమైన మిషన్ రిపేర్ లో ఉండడంతో ఎలాంటి ఆపరేషన్ చేయలేని పరిస్థితి వచ్చింది.
దీనితో రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ వారికి ఈ ఆసుపత్రికి తీసుకొస్తే కేవలం ప్రాథమిక చికిత్స చేసి తదుపరి ఏదైనా ఆపరేషన్ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రి కి రెఫర్ చేస్తున్నారు.
కానీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేని స్తోమత ఉంటె వారికి అత్యవసర ఆపరేషన్ లు చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు.
కేవలం అడ్మిట్ చేసుకొని ప్రధమ చికిత్సలు అందిస్తున్నారు ఏదైనా సీరియస్ కేసులు వస్తే వారిని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు నిసిగ్గుగా సలహాలు ఇస్తున్నారు ఈ ఆపరేషన్ థియేటర్ మరో 15 రోజులు మరమ్మత్తులో ఉంటుందని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు ఆర్తో కు సంబంధించిన ఏవైనా కేసులు వస్తే వారికి తాత్కాలికంగా ఎటువంటి సదుపాయాలు కలిగించకపోవడం గమనార్హం .
ఆపరేషన్ థియేటర్ లోనూ ముఖ్యమైన పరికరం సైతం పనిచేయడం లేదు. దీనివలన పేషెంట్లు తీవ్రఅవస్థలు పడుతున్నారు. నిజానికి జిల్లాలో రెండు జాతీయ రహదార్లు ఉన్నాయి అందుకే రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువగా ఉంటాయి. కానీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి కి ప్రస్తుతి కేసుల తరవాత రోడ్డు ప్రమాద బాధితులే ఎక్కువగా వస్తుంటారు.
అయినప్పటికి ఆర్థో విభాగం మూసేయడం ఫై విమర్శలు వెలువెతుతున్నాయి. మిగతా విషయాలలో అన్నింటిలో ముందుండే ఆసుపత్రి అధికారులు ఆర్థో పేషెంట్లకు చికిత్స చేయటంలో ఉదాసీనంగా వ్యవహరించడం చర్చనీయంశంగా మారింది.




