సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 40 రోజులుగా పాలన వ్యవస్థగా స్తంభించిపోయింది. అత్యవసరపనులు సైతం చేయడానికి సైతం అధికారులు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా పనిచేసే రెవెన్యూ అధికారులు పూర్తీ రెవెన్యూ వ్యవహారాలు పక్కకు పెట్టేసి కేవలం ఎన్నికల తాలూకు పనులకే పరిమితం అయ్యారు.
కానీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన కతృవు దాదాపు పూర్తిఅయింది. సోమవారం పోలింగ్ పూర్తిఅయింది. కేవలం కౌంటింగ్ ప్రక్రియే మిగిలి ఉంది. కౌంటింగ్ విధుల కూడా పరిమిత సంఖ్యలోనే సిబ్బంది వుంటారు. పోలింగ్ విధులు పూర్తీ చేసిన అధికారులు మూడు రోజులైనా తమ కార్యాలయాల వైపు కన్నెత్తి చుడలేక పోతున్నారు.
తాము ఎలాగో ఇంకా ఎన్నికల విధుల్లో ఉన్నామనే ధీమాతో తమ కార్యాలయాల్లో పాలన వ్యవహారాల ను పట్టించుకోవడం లేదు. ఎన్నికల నియమావళి మేరకు జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారులందరూ పొరుగు జిల్లాకు వెళ్లారు ఆయా జిల్లాకు చెందిన అధికారులందరూ జిల్లాకు వచ్చారు.
ఎన్నికల కోడ్ ఎత్తివేసాక తాము ఎలాగో తమ సొంత జిల్లాకు వెళ్తామనే ఆలోచనతో ముఖ్యంగా తాశీల్ధారులు విధుల కు రావడం ఫై ఆసక్తి చూపడం లేదు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉత్తర మండల తహసిల్దార్ ఆఫీస్ లో పరిస్థితి ని ఇది సంగతి గురువారం పరిశీ లించింది.
తాసిల్దార్ , డిప్యూటీ తహసిల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ,సీనియర్ అసిస్టెంట్లు ,జూనియర్ అసిస్టెంట్లు, ఎవ్వరు కూడా హాజరు కాలేదు 1౧ గంటల 45 నిమిషాలైన కార్యాలయానికి రాలేదు. మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు మొదలవుతున్నాయి.
వివిధ పత్రాలు కోసం విద్యార్థులు తహశీల్ధార్ కార్యాలయానికి వచ్చి ఖాళీ కుర్చీలు చూసి వెనుదిరుగుతున్నారు. భూముల క్రయవిక్రయాలు చేసే సైతం అధికారులు ఆఫీస్ కు ఎప్పుడొస్తారో తెలియక అవస్థలు పడుతున్నారు.