గుండె పోటుతో వ్యవసాయాధికారి మృతి.ధర్పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ (40) బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు.
గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్నారు , అధికారులతో కలుపుగోలుగా ఉంటూ అన్ని రకాల పనులను సమయస్ఫూర్తిగా చేసే అధికారి ప్రవీణ్ కుమార్ మృతి చెందడం బాధాకరమని ఎంపీపీ సారికా రెడ్డి, జెడ్పిటిసి జగన్, ఎంపీడీవో బాలకృష్ణ, తాహాసిల్దార్ మాలతి లు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మృతుడు ప్రవీణ్ కుమార్ స్వగ్రామం భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన వాస్తవ్యులు కాగ స్వగ్రామంలో అంత్య క్రియలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.