Tuesday, April 21, 2026
HomeTelanganaHyderabadవెనక్కి తగ్గని సర్కార్ .....ఆగని కూల్చివేతలు ....

వెనక్కి తగ్గని సర్కార్ …..ఆగని కూల్చివేతలు ….

మూసి ఆక్రమణలతొలగింపు పక్రియ మంగళవారం మొదలయ్యింది. ముఖ్యంగా తమ ఏరియాలో కి అడుగు పెడితే కబడ్ధార్ అని యంఐయం ఎమ్మెల్యే గద్దించిన మరుసటి రోజే పాత బస్తీ లో కూల్చివేతలు మొదలు కావడం గమనార్హం.

చాదర్ ఘాట్ రసూల్ పూర్ శంకర్ నగర్ తదితర ప్రాంతాల్లో కూల్చివేతల తో ఒక్కసారిగా అలజడి రేగింది. కానీ జేసీబీ లాంటి యంత్రాలు కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందే ఇండ్లను కూల్చివేస్తున్నారు.

ఒక్కో ఇంటికి పది మంది ఒక్కసారిగా చుట్టుముట్టి కూల్చేస్తున్నారు. అయితే ఇదివరకే మార్కింగ్ వేసిన ఇండ్లను అదికూడా ఖాళీ చేసిన ఇండ్లనే కూల్చేస్తున్నారు. అందుకే ఎలాంటి ప్రతిఘటన లు ఎదురుకావడం లేదు .

కూల్చివేత ల విషయంలో హైకోర్టు ధర్మాసనం గట్టిగా నిలదీసినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ససేమిరా అంటుంది. ఇతర ప్రాంతాల్లో సంగతి ఎలా ఉన్నాసరే మూసి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో సర్కార్ మరింత దూకుడు పెంచింది.

బాధితుల ఆక్రొషాలు ప్రతిపక్షాలు ఆందోళన తో వెనకడుగు వేస్తుందని భావించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!