మాక్లూరు మన తెలంగాణ న్యూస్…మాక్లూర్ మండలంలోని సింగంపల్లి తండా గ్రామ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థిగా జాదవ్ శాంత,వార్డు సభ్యులకు కూడ ఒక్కో క్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
తండాలో నామినేషన్ల పక్రియ ప్రారంభమైనప్పటి నుండి చివరి రోజైన మంగళవారం వరకు మరెవరూ నామినేషన్లు వేయలేదు.దీంతో తండా పాలకవర్గం ఏకగ్రీవం లాంఛనమే అయింది.దీంతో తండావాసులు పెద్ద ఎత్తున టపాకాయ లు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
ఇక తండా సర్పంచ్ జాదేవ్ శాంత,ఉప సర్పంచ్గా బానోత్ సంజీవ్,8 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించమే మిగిలింది.
