నాడు నిజామాబాద్ నగర ఫిఫ్త్ టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ గారు మరియు నార్త్ రూరల్ సిఐ బి. శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఫిఫ్త్ టౌన్ ఏరియాలో గల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 200 మంది తో మీటింగ్ పెట్టడం జరిగింది.
ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి (Does & Don’ts) వాళ్లకు సూచన చేయడం జరిగింది .
అలాగే ఈ మీటింగ్ లో నిజామాబాద్ సౌత్ ఎమ్మార్వో బాలరాజు గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడిఈ చంద్ర శేఖర్ గారు, మున్సిపల్ ఏఈ వాజీద్ గారు మరియు మున్సిపల్ మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
ఫిఫ్త్ టౌన్ ఏరియాలో అందాజ 120 విగ్రహాలు పెట్టడం జరుగుతుంది కావున ఈ 120 విగ్రహాలు కూడా ఆన్లైన్ చేయాలి అని సూచించారుపోలీసు వారు సూచించిన సూచనలు:-
వినాయకుని పెట్టుకునే క్రమంలో కంపల్సరిగా ఆన్లైన్ చేసుకోవాలి అని సూచించారు ఈ మీటింగ్ లో విగ్రహాలు ఎక్కడ పెడతారో వాటి ఇన్చార్జి కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని అలాగే ఆ విగ్రహాల దగ్గర నైట్ ఎవరైనా ఇద్దరు పడుకోవాలని పవర్(కరెంట్ )కు సంబంధించింది
ఎలక్ట్రిసిటీ ఏఈ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని కరెంటు పెట్టుకోవాలని పవర్ కనెక్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలని ఎట్టి పరిస్థితుల్లో డీజే పెట్టుకోకూడదని క్రాకర్స్ అటువంటివి వినాయక మండపాల దగ్గర గాని వినాయక నిమజ్జనంజరిగేటప్పుడు గానీ పేల్చరాదని వినాయక మండపం దగ్గర మినిమం ఒక సీసీటీవీ పెట్టుకోవాలని వినాయక మండపాల దగ్గర ఏదైనా అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక బకెట్లో ఇసుక మరియు ఒక బకెట్లో వాటర్ పెట్టుకోవాలని
ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 10 దాటిన తర్వాత ఎటువంటి సౌండ్ బాక్స్ లు పెట్టుకొని పాటలు గానీ పెట్టుకోకూడదు వినాయకుని తీసుకొచ్చే క్రమంలో గాని నిమజ్జనం సమయంలో పోయే మార్గంలో గాని ఆ వైర్లు ఎత్తు కిందికి ఉండడం వలన ఆ వైరును పైకి అనే క్రమంలో ఎప్పుడు కూడా ఐరన్ పైపులు వాడరాదని PVC పైపులు వాడాలని వినాయక మండపం రోడ్డుపైన కాకుండా ఏదైనా ఫ్లాట్లో గాని ఏదైనా ఓపెన్ ప్లేస్ లో గాని పెట్టుకోవాలి
ఆ వినాయక మండపం ట్రాఫిక్కు అంతరాయం కలవకుండా ఉండాలి .
ఆ సౌండ్ బాక్స్ లో భక్తి గీతాలు మాత్రమే పెట్టుకోవాలని మండపంలో విగ్రహం కింది భాగంలో ఎటువంటి వస్తువులు గాని పెట్టుకోవద్దని
వినాయక నిమజ్జనం సమయంలో ఎవరు కూడా మందు, మిగతా మత్తుకు సంబందీoచినవి త్రాగకూడదని భక్తి శ్రద్ధలతో నిమర్జనం చేయాలని
ఊరేగింపు సమయంలో వినాయక విగ్రహం తో పాటు ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకోవాలి అని సూచించారు.
గత పది సంవత్సరాల నుండి వినాయక మండపంలలో మట్టి విగ్రహం ప్రతిష్టాపన చేసి అలాగే వినాయక నిమజ్జనం సమయంలో భక్తి భజనలతో మాత్రమే నిమర్జనం చేసిన నలుగురిని గుర్తించి వారికి( 1. వర్ని చౌరస్తా గణేశ్ మండలి, ఇంద్రాపూర్ గణేశ్ మండలి , కెనాల్ కట్ట గణేశ్ మండలి , కిల్లా చౌరస్తా గణేశ్ మండలి ) సన్మానం చేయడం జరిగింది.
