క్షయవ్యాధిని నిర్మూలించడానికి చేపడుతున్న కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దు కోవాలనీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి నివారణ మరియు నిర్మూలన కోసం మొత్తం 185సెంటర్లు ప్రారంభించారని అందులో ఒకటి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారని వెల్లడించారు.
జీజీహెచ్ లో నిత్యం వేలమంది ఓపీ లు వస్తున్నారని అందుకు ఇక్కడ సెంటర్ ను ప్రారంభించారని వెల్లడించారు. ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన కోసం భారతదేశం కృషి చేస్తోందనీ పేర్కొన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలన కోసం జీజీహెచ్ కు న్యూఢిల్లీ నుంచి డాక్టర్ పార్థసారథి,డాక్టర్ భారత్ కుమార్,ప్రమోద్ రెడ్డి లు వైద్యబృందం వచ్చారని తెలిపారు. భారత్ లో విస్తరిస్తున్న అనేక వ్యాధుల్లో ఈ క్షయ వ్యాధి ఒకటి.
ఇది మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) ద్వారా సంభవించే అంటువ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినదే అయిన చర్మం నుంచి మెదడు వరకు శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉందనీ వివరించారు.
టిబి నిర్దారణ కోసం టిబి పరీక్ష, సిబెనెట్ పరీక్షలు అవసరమవుతాయి.అవి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉంటాయనీ తెలిపారు.
ఎలా వ్యాపిస్తుంది..?
క్షయ వ్యాధి ‘మైకోబాక్టీరియం ట్యుబర్కులోసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఊపిరితిత్తులు లేదా గొంతు టిబి ఉన్న రోగి దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలుబడే తుంపరలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పీల్చినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ఊపిరితిత్తుల క్షయవ్యాధి లక్షణాలు..
రాత్రి చెమటలు, జ్వరం, దీర్ఘకాలిక దగ్గు,ఆకలి తగ్గడం లేదా పోతుంది, బరువు తగ్గడం హెమోప్టిసిస్ (రక్తపు కఫం దగ్గు), శ్వాస ఆడకపోవడం,ఛాతి నొప్పి,వాచిన శోషరస కణుపులు మరియు అలసట