మూడో సారి అధికారంలోకి వచ్చిన మొదటి సారిగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో పూర్తీ స్థాయి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 32.07 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదించారు. వికసిత భారత్ తమ లక్ష్యంగా చెప్తున్న మోడీ సర్కార్ 2047 విజన్ కు అనుగుణంగానే బడ్జెట్ రూప కల్పన చేసింది.
మౌలికవసతుల అభివృద్ధి, రక్షణ రంగంలో ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యసేవలు తదితర తొమ్మిది రంగాలపై ఈ పద్దులో ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా తొమ్మిది అంశాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు.. అవేంటంటే :
- వ్యవసాయం
- ఎంప్లాయిమెంట్
- అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి
- ఉత్పత్తి, సర్వీసు రంగాలపై ఫోకస్
- పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్
- ఇంధన రంగం
- మౌలిక వసతుల కల్పన
- రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
- రాబోయే తరానికి తగ్గట్టు సంస్కరణలు
ధరలు తగ్గేవి @@@@@ ధరలు తగ్గేవి ఇవే @@@@@@@.
ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
//// మహిళలకు పెరిగిన ప్రాధాన్యత @@@@@@
దేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే మహిళలను హాస్టళ్లు, కేర్ సెంటర్ల ద్వారా ఉద్యోగం వైపు ప్రోత్సహిస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రూ.3లక్షల కోట్లకు పైగా కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు
//////// యువత కు గుడ్ న్యూస్ @@@@@
దేశంలో కోటి ముంది యువతకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ ఇప్పిస్తామన్నారు. అందులో భాగంగా 12 నెలల పాటు అభ్యర్థులకు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్ టైం అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తామన్నారు.
////// యువత కు గుడ్ న్యూస్ @@@@@
దేశంలో కోటి ముంది యువతకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ ఇప్పిస్తామన్నారు. అందులో భాగంగా 12 నెలల పాటు అభ్యర్థులకు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్ టైం అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తామన్నారు.@@@