సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం…నిజామాబాద్ నగరంలోని సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని ఆర్యనగర్ లో గల్ శ్రీ మార్ట్ సూపర్ మార్కెట్ లో సోమవారం అర్ధ రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు రేగాయి.గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి చేశారని తెలిపారు. సుమారు పది లక్షల విలువ చేసే మార్ట్ లోని సామాను కలిపోయినట్టు ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు తెలిపారు.