మల్టీజోన్–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పీసీఆర్ విభాగంలో పనిచేస్తున్న సీఐ సండ్ర వీరయ్యను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐగా బదిలీ చేశారు.
అలాగే బండి సంతోష్‌కుమార్‌ను కామారెడ్డి సీసీఎస్ విభాగానికి బదిలీ చేశారు. కామారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తున్న సీఐ రామన్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పీసీఆర్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
