నగలు తయారు చేయించుకునేందుకు తీసుకెళ్లిన 8 తులాల ముద్ద బంగారం కనిపించకుండా పోయింది. నగరంలోని గంగస్థాన్‌కు చెందిన సుధా బంగారు నగలు చేయించుకునేందుకు ముద్ద బంగారాన్ని చిన్న పౌచ్‌లో పెట్టుకుని కుమార్‌గల్లికి వెళ్లారు. అక్కడ నగలు తయారు చేసే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు గాంధీగంజికి వెళ్లారు.
కూరగాయలు తీసుకున్న అనంతరం బ్యాగ్‌ను పరిశీలించగా బంగారం ఉన్న పౌచ్ కనిపించలేదు. పరిసరాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్-1 ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
