మోడీ మూడోసారి ప్రధాని కావాలంటే నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలవాలని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి సింగ్ దామి అన్నారు ఆయన గురువారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ నామినేషన్ సభలో మాట్లాడారు.
అరవింద్ గత ఎన్నికల్లో జిల్లా రైతులకు ఇచ్చిన పశువుడ్ హామీని నిలబెట్టుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించడానికి హామీ ఇస్తున్నారని ఆయన ప్రస్తావించారు జిల్లా ప్రజల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఢిల్లీ స్థాయిలో గట్టిగా గొంతే వినిపించే శక్తి అరవింద్ కు ఉందని ఆయన అన్నారు. వచ్చే నెల 13న పోలింగ్ అయ్యేవరకు పార్టీ కార్యకర్తలు చెమట వచ్చి శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు నిజాంబాద్ నియోజకవర్గం ప్రగతి పథం వైపు దూసుకెళ్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు సాధ్యం కానీ హామీ ఇచ్చి దొడ్డిదారిలో గద్దెనెక్కింది అన్నారు. తెలంగాణలో దోచుకుంటున్న సొమ్మును ఇక్కడి నాయకులు ఢిల్లీ గాంధీ కుటుంబ ఖజానాలకు చేరుస్తున్నారని. దేశంలో కాంగ్రెస్ పార్ ప్రస్థానం చివరి దశలో చేరిందని ఆ పార్టీ ఒకటి రెండు రాష్ట్రాల్లోకి మించి అధికారంలో లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసికట్టుగానే పనిచేస్తున్నాయని ఎన్నికలను బిజెపిని ఓడించడానికి లోపాయ కారిగా చేతులు కలిపాయి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న అనేక దేశాలు కుప్పకూలిపోయాయని కానీ దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరిందని ఇది ఓర్చుకోలేని కొన్ని విదేశీ శక్తులు భారతదేశంలోని మోడీ వ్యతిరేకులతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.





