గత ఎన్నికల్లో జిల్లా పసుపు రైతులకు ఇచ్చిన హామీ మీద హామీ మేరకు పసుపు బోర్డు సాధించానని బోర్డును నిజాంబాద్ గడ్డమీదనే ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని నిజాంబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు.
ఆయన గురువారం నామినేషన్ వేసిన తర్వాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన సభలో మాట్లాడారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవరెడ్డిని గెలిపిస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు పసుపు బోర్డు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో తెలియని అజ్ఞానంలో రేవంత్ రెడ్డి ఉన్నారని పసుపు బోర్ కేంద్ర ప్రభుత్వం లో వాణిజ్య శాఖలో ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డిని నిరుద్యోగులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఈనాడు వారి సమస్యల గురించి కనీసం ప్రశ్నించలేదు న్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ఎన్నడూ ప్రశ్నించలేదు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీ లీకేజీ అవుతున్న ఏనాడు ఉద్యమించలేదని కనీసం విద్యావ్యవస్థలో లోపాలను కూడా చట్టసభలో ప్రశ్నించే లేకపోయారని జిల్లా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని ఐదేళ్లుగా ఎంపిక పని చేసింది తాను జిల్లా అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చానని అవినీతి మరక లేకుండా పనిచేశానన్నారు .
లోక్సభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వీరులో ఎవరు ఎలాంటి వారు గుర్తించి ఓటు వేయాలని ఆయన కోరారు ఎంపిక రెండోసారి అవకాశం ఇస్తే జగిత్యాల -మంచిర్యాల ఆదిలాబాద్ -ఆర్మూర్ బీదర్ -బోధన్ మధ్య రైల్వే లైను మంజూరు చేయిస్తానని అలాగే జిల్లాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ నితెరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని మరి 17న తెరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటే నాయకులు మాత్రం వచ్చే ఏడాది చివర్లు ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్తున్నారని ఆయన గుర్తు చేశారు