డిసియం వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి చెంది 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ మండలం మల్లారం గండి ప్రాంతంలో గురువారం అర్థ రాత్రి జరిగింది.
కమ్మర్ పల్లి నుంచి పెద్దగుట్ట ( బడాపహాడ్ ) కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
