-మృతుల కుటుంబాలలో నెలకొన్న విషాదం
-బడా పహాడ్ వెళ్తుండగా డీసీఎం బోల్తా
-కమ్మర్ పల్లికి చెందిన రెంజర్ల వసంత, రెంజర్ల శ్యాంసుందర్ లు అక్కడికక్కడే మృతి
- 30 మందికి తీవ్ర గాయాలు
- మద్యం మత్తులో వాహనాన్ని నడపిన డ్రైవర్
జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్ : బడా పహాడ్ దర్గాకు వెళ్లి మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ప్రయాణంలో మార్గమధ్యలో మృత్యువు కబళించింది. మద్యం మత్తులో సీఎం డ్రైవర్ వాహనాన్ని నడపడమే ఈ సంఘటనకు కారణమని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కమ్మర్పల్లి నుండి డీసీఎం వ్యాన్ లో రాత్రి 9 గంటల తర్వాత సుమారు 50 మందితో బయలుదేరారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని దాటి బడా పహాడ్ కు వెళ్తుండగా మల్లారం అటవీ ప్రాంతంలో కొత్తపేట శివారులో డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో అక్కడికక్కడే కమ్మర్ పల్లికి చెందిన రెంజర్ల వసంత, రెంజర్ల శ్యాంసుందర్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతురాలు రెంజర్ల వసంత ఇటీవలే విదేశం నుండి స్వగ్రామానికి వచ్చింది. మృతురాలికి ఇద్దరు చిన్న వయసు కలిగిన పిల్లలు ఉన్నారు.
సుమారు 30కి పైగా మందికి తీవ్ర గాయాలయ్యాయి. రేంజర్ల శ్యాంసుందర్ స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. గాయాలైన వారిలో ఎక్కువమంది మహిళలు , చిన్నపిల్లలు ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే ఆంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు మరిగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.



