నగర ప్రజల చిరకాల వాంఛ అయిన నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని నిజామాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పేరుకొన్నారు . శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే బాధ్యత యువత మీదే ఉందన్నారు.తాము ఓటెయ్యడమే కాదు కుటుంబసభ్యులందరి తో వోట్లు వేయించాలన్నారు అప్పుడే దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దిన వారవుతారని అన్నారు.
దేశంలో సమర్థమైంతమైన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా యువత పైనే ఉందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులతో అమృత్ పథకం స్కీం ద్వారా నిధులు మంజూరు చేస్తే అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేశారన్నారు.
ప్రధాని మోడీ హయాంలో నే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఆధునికరణను సంతరించుకున్నాయన్నారు. మరో వైపు రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కేవలం ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.