HomePOLITICAL NEWSArmoorసారు… రేటే… సెపరేటు…? పైసలు ఇస్తే పని జరుగుతుంది… లేదంటే అంతే…! అక్రమ వసుళ్ళకు ఆజ్యం...

సారు… రేటే… సెపరేటు…? పైసలు ఇస్తే పని జరుగుతుంది… లేదంటే అంతే…! అక్రమ వసుళ్ళకు ఆజ్యం పోస్తున్న ఏజెంట్లు..’ఆ నలుగురే’ సూత్రధారులు…-ఏసీబీ అధికారులు ఓ కన్నెయాలని కోరుతున్న స్థానికులు

ఆర్మూర్: మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా… డ్రైవింగ్ స్కూల్లో చేరి ఒక నెల రోజులు కష్టపడాల్సిన పని ఏమీ లేదు. డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావలసిన అవసరము అంతకంటే లేదు. గుర్తింపు కార్డులు సరిగా ఉన్నా సరే, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు.

ఒక ఫోటో ఇచ్చి నోట్లను చేతిలో పెడితే చాలు.. ఏంచక్కా మీ పని జరిగిపోతుంది. ఆర్మూర్ డివిజన్ లో రోడ్డు రవాణా శాఖలో పైసలిస్తే పని కానిది ఏమున్నది అన్న చందంగా తయారైంది పరిస్థితి. కాసులకు కక్కుర్తి పడుతున్న ఆర్టిఏ అధికారులు, సిబ్బంది పైసలు ఇస్తే చాలు… పరిశీలించకుండానే పనిచేస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి.

ఈ దందాకు ఆర్మూర్ డివిజన్ అడ్డగా మారింది. డబ్బులు ఇస్తే కానీ పని అంటూ ఏమీ ఉండదు. వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి లైసెన్సుల వరకు ఏ పని అయినా చేసి పెడతారు.

ఆర్టిఏ అధికారులు ఏజెంట్లను పెట్టుకొని చేతికి మట్టి అంటకుండా పని కానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లైసెన్స్ కోసం రూల్స్ ప్రకారం అన్ని ఆధారాలతో వచ్చిన, కచ్చితంగా బ్రోకర్ ను మీట్ కావాల్సిందే! లేదంటే ఎన్ని రోజులైనా అప్లికేషన్ కదలదు. ఏజెంట్లకు డబ్బు ముట్ట చెబితే చాలు .. వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే టెన్త్ మేమో గుర్తింపు కార్డుతో మీ సేవలో స్లాట్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి ఓ టెస్ట్ ను నిర్వహిస్తారు. పరీక్షలో పాస్ అయితే లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది. మరో నెల రోజుల తర్వాత వాహనం నడిపి చూపిస్తేనే లైసెన్స్ వస్తుంది. కానీ ఈ ప్రాసెస్ ఏమి లేకుండానే లైసెన్సులు మంజూరు చేస్తున్నారు.

అక్రమ వసూళ్లకు పాత్రధారులు ఆ నలుగురు అయితే…సూత్రధారి మాత్రం …. అన్ని సారు…గారే..! అని అని స్థానికులు అంటున్నారు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం సదరు సార్ గారి రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

లర్నింగ్ లైసెన్స్ ప్రభుత్వ రుసుం 450రూ.. సార్ రేటు 590
బైక్ రిజిస్ట్రేషన్. 00 440
కార్ రిజిస్ట్రేషన్. 00. 920
డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ 1335. 840
యజమాని బదలాయింపు 590. 370
ఆటో ఫిట్నెస్ 700. 600
మిని గూడ్స్ వెహికల్ ఫిట్నెస్. 800. 860
టిప్పర్ ఫిట్నెస్. 1000. 1250
ఫైనాన్స్ క్లియరెన్స్. 435. 370
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్. 835 370
బైక్ కార్ లేట్ రిజిస్ట్రేషన్ 100. 1960
క్లియరెన్స్ సర్టిఫికెట్. 100. 670
లారీ ఫిట్నెస్. 1000. 3840
స్కూల్ బస్సు ఫిట్నెస్ 1000 4060

పైగా ఎలాంటి డ్రైవింగ్ చేయకుండా లైసెన్స్ పొందాలంటే 2000 రూపాయలు సార్ గారికి ముట్ట చెప్పాల్సిందే..! అంతే కాకుండా నిజామాబాదులో రిజిస్ట్రేషన్ అయ్యే ట్రాక్టర్ వెరిఫికేషన్ ఆర్మూర్లో చేయాలంటే 1060 రూపాయలు ఆటో కోసం 840, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లో పుట్టినరోజు తండ్రి పేరు లాంటిది కరెక్షన్ తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు 835 కాగా, ‘ సార్’ కు 1000 రూపాయలతో పాటు మరో 370 చెప్పాల్సిందే…? అన్నట్టు సమాచారం.

రాష్ట్రమంతా ఓ పక్క ఏసిబి దాడులు హడల్ చేస్తున్న తరుణంలో ఓసారి ఆర్మూర్ రవాణా శాఖ తీరుపై కూడ కన్నేయాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments