HomeTelanganakamareddyనా ఫై కేసులో బడా నేత కుట్ర ఉంది …….తమ్ముడు కొడుకు అల్లుడు బాగోతం విప్పుతా...

నా ఫై కేసులో బడా నేత కుట్ర ఉంది …….తమ్ముడు కొడుకు అల్లుడు బాగోతం విప్పుతా ……..పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ ధ్వజం


.

కామారెడ్డి జయ శంకర్ కాలనిలో పేలుడు పదార్థాలకేసులో తనను కావాలని పథకం ప్రకారం ఇరికించారని దీనివెనుక పార్టీ పెద్ద ఉన్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.

క్లైమర్ మెన్స్ డిటొనేటర్ కేసులో అరెస్ట్ అయిన ఆయన గురువారం బైయిల్ మీద రిలీజ్ అయ్యారు.శుక్రవారం కామారెడ్డి లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
.

నాకు సంబంధం లేదని ఆ వెంచర్ కు సంబంధించి వివరాలు పోలీసులకు ఇచ్చానువారు పిలువ గానే పోలీస్ స్టేషన్ వెళ్ళాను అన్ని వివరాలు నా నుంచి తీసుకున్నారు
ఆ వెంచర్ కు నాకు సంబంధం లేదు అని డాక్యుమెంట్ ఆధారాలతో చూపెట్టన్నారు

రూరల్ సీఐ అక్కడికి వచ్చి ఎస్పీ ని కలవడానికి వెళదామని చెప్పి తీసుకెళ్లి నేరుగా ఆ రాత్రి బాన్సువాడ పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని.

అక్కడే పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పారని
అక్కడి నుండి బిచ్కుంద జడ్జి ముందు ఉంచి నిజామాబాద్ జైలు కు తరలించారన్నారు. తనపై పైన రాజకీయ కుట్ర జరిగిందన్నారు

పార్టీకి చెందిన ఓ బడా నేత నా మీద కావలానే బురద జల్లుతున్నారు.

నేను తప్పించుకునీ తిరగడానికి నేను రాడికల్స్ కాదు.. ప్రజా నాయకుణ్ణి.కానీ పోలీసులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు


వారి వెంట ఉండి పార్టీ కి చెందిన ఒక పెద్దమనిషి చేయిస్తున్న కుట్ర అన్నారు పార్టీ పెద్దల దృష్టికి కి కూడా ఈ విషయం పోయిందన్నారు


రాజకీయంగా నా ఎదుగుదల ఓర్వలేక ఇలా కుట్రలు చేస్తున్నారని
ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇలా చేయడం, సమంజసం కాదన్నారు న్యాయ వ్యవస్థ వల్ల నాకు న్యాయం జరిగింది. నాకు బెయిల్ దొరికిందన్నారు

ఆ పెద్దమనిషి పై పిర్యాదు చేస్తా, అతని తమ్ముడి గురించి, కొడుకు ,అల్లుడు గురించి మొత్తం చిట్టా విప్పుతా అన్నారు ఎవరు ఏం చేస్తున్నారో హై కామండ్ కు పిర్యాదు చేస్తాన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments