పీకల దాక తాగిఉన్న ఓ కొడుకు ఓ చిన్న వివాదం తలెత్తడడం తో తండ్రిని హత్య చేసిన ఘటన రుద్రూర్ మండలం అంబం గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి తాగిన మైకంలో తన తండ్రి షేక్ హైమద్(65)తో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రిపై దాడి చేయడంతో హైమద్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపారు
