భీమ్ గల్ లోని లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నిజామాబాద్ డిపో ఆర్ఎం మేనేజర్ జానీ రెడ్డి బుదవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమయిన భీమగల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మినరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో 15 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు టి.జి.యస్. ఆర్టీసీ ఆర్మూర్, నిజామాబాద్, ధర్పల్లి, సిరికొండ నుండి లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొవాలని తెలిపారు.
