ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి తీరని వేదన మిగిలింది. నిజామాబాద్ జిల్లా తడపాకల్ గోదావరి వద్ద గంగ స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన బుదవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. మాణిక్ బండారు గ్రామానికి చెందిన ఉమ్మాయి రామ్ చరణ్ (17)తన తల్లి గంగామనితో కలిసి బుదవారం ఉదయం ఏర్గట్ల మండలంలోని తడపాకల్ లో ఉన్న గోదావరి నదిలో స్నానానికి వెళ్ళాడు. నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో గల్లంతయ్యాడు.కుమారుడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.
