HomePOLITICAL NEWSచంద్రబాబు కు చంచా గిరి చేస్తున్న రేవంత్ .......కేటీఆర్ ...

చంద్రబాబు కు చంచా గిరి చేస్తున్న రేవంత్ …….కేటీఆర్ …వెయ్యి రోజుల పాలన ఫై బిఆర్ యస్ ఛార్జ్ షిట్

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలేసి చంద్రబాబుకు చంచాగిరి చేస్తూ గురువుగారికి దక్షిణగా కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడని బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు అందాల పోటీలకు పెట్టిన ఖర్చులో పదో వంతు ఖర్చు చేస్తే కాఫర్‌ డ్యాం కట్టి నీళ్లు ఇయ్యొచ్చని ఇంజిర్లు చెప్పారు.

వారికి బెల్టు ట్రీట్‌మెంట్‌ ఉంటుందని భయపెట్టారన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూల్చినా, చెక్కు డ్యాంలు కూలినా బీజేపీ, ఎన్‌డీఎస్‌ఏ నోరు తెరువదు. జీఆర్‌ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఎజెండా పెడితే పారిపోతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే అధికారి ఆదిత్య నాద్‌ దాస్‌ ను సలహాదా రుగా పెడితే తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డ భూములను కొల్లగొడుతున్నారు. రూ.50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని రూ.20 కోట్లతో ముగించారని మండిపడ్డారు.

నీళ్లు అడిగితే కోసి రక్తం చల్లమన్నారు. యూరియా అడిగిన రైతులపై లాఠీ చార్జి చేశారు. కాళేశ్వరంపై కక్ష రైతన్నకు శిక్ష, మోటర్లుకు మీటర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు బందు అయింది. . కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలంగాణ భవన్‌లో ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఉద్యోగులకు హామీలు ఇచ్చి చివరకు ఉత్త చేతులు చూపించారని కేటీఆర్‌ విమర్శించారు.

22A పేరుతో భూములను కొల్లగొడుతున్నారని, అవినీతి అనకొండలా పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రభుత్వం ఢిల్లీ ముందు మోకరిల్లుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ 1000 రోజుల పాలనలో రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఎంగిలి ఆకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టుగా పరస్పరం గొడవపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నాం’ :మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని తెలిపారు.

100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారని హరీశ్‌రావు అన్నారు.

అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో ఒక్కో రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments