HomeLaw and Orderగ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు…

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమి షన్ నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షకు పోలీసు శాఖ తరపున అన్ని రకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ తెలియ జేశారు. ఈ నెల 17,18 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో ముందస్తు సెషన్ 10:00 AM నుండి 12:30 PM వరకు, మధ్యాహ్నం సెషన్లో 3:00 నుండి 5:30 వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనవసరంగా గుంపులు గుంపులుగా ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాప్లు తెరిచి ఉంచరాదని సూచించారు.

అలాగే కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఏసీపీ, సీఐ, ఎస్ హెచ్, ఎస్ఐలను ఆదేశించారు. అదేవిధంగా 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు ఒక్కో పోలీస్ అధికారిని కేటాయించినట్లు పేర్కొన్నారు.పరీక్ష కేంద్రం వద్ద లా & ఆర్డర్‌ను నిర్వహించడానికి, అభ్యర్థుల పర్యవేక్షణకు తగిన పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments