నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆద్వర్యంలో క్రీడ పోటీలు ఆదివారం నుంచి ఐదురోజుల పాటు నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ స్మరకార్థం నగరంలోని పాత కలెక్టర్ మైదానంలో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ పోటీలలో సుమారు 150 పాఠశాల,జూనియర్ కళాశాలలు పాల్గొననున్నాయి.
ఈ క్రీడలలో మొదటి రెండు స్థానాలకు నగదు ప్రోత్సాహం తో పాటు వ్యక్తి గత బహుమతులు ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు.
