శ్రీ చైతన్య విద్యా సంస్థల స్థాపకుడు బిఎస్ రావు జ్ఞాపకార్థం శనివారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జోనల్ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు.పోటీలలో నిజామాబాద్ సిబిఎస్ఈ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పాల్గొని పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు.
[చెస్ జూనియర్ &సీనియర్ విభాగంలో -1 ప్రైజ్,త్రో బాల్ బాలికల విభాగంలో -2ప్రైజ్,క్యారమ్ సీనియర్&జూనియర్ విభాగంలో -1ప్రైజ్,రిలే (4×100మీ)బాలికల విభాగంలో -2ప్రైజ్ ]సాధించారు. గెలిచిన విజేతలకు స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్త బహుమతులను ప్రధానం చేశారు.
ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు శరీరక ఆరోగ్యానికే కాకుండా మానసికంగా దృఢంగా ఉంచుతాయని అన్నారు.కార్యక్రమంలో జోనల్ కో-ఆర్డినేటర్ మహిపాల్ రెడ్ది,ప్రిన్సిపాల్ గురుచరణ్,ఐపిఎల్ ఇంచార్జ్ శివకుమారు,ఆయా పాఠశాలల ఇంచార్జులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
