నిజామాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు నాసిరకం ఎవరు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విజయ్ బాబు తెలిపారు. మంగళవారం జిల్లా సీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి సీడ్స్ మరియూ విత్తనాల దుకాణాలను విస్తృతంగా తానికీలు నిర్వహించారు. దుకాణాలలో నకిలీ విత్తనాలు,ఎరువులు క్రిమి సంహారక మందులపై ఆరా తీశారు.
రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు విక్రయించి మోసం చేస్తే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో ప్రతి ఒక్కరూ రషీద్ ఇవ్వాలని సూచించారు. రైతులు విత్తనాలు కొనేముందు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని విత్తనాలు కొనాలని తెలిపారు.
జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించారు . వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ సౌమ్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.