రైలు నుంచి జారుపడి వ్యక్తి మృతి చెందిన ఘటన చిర్నపల్లి ఇందల్వాయి రైల్వే పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి వివరాల ప్రకారం. సిర్నపల్లి ఇందల్వాయి గ్రామాల మధ్య సోమవారం రాత్రి గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి బండారు రవి (29)మృతి చెందాడు.
మృతుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా పొదలి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.