అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సంబరాలనేపథ్యంలో వచ్చిన లోకసభ ఎన్నికల ఫలితాలు సర్వత్ర ఆసక్తి గా మారాయి. ప్రధాన పార్టీలు ఫలితాల మీద యిప్పటికే ఓ అంచనాకు వచ్చేసాయి. లోకసభ ఎన్నికల ఫలితాలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగానే భావించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా తలపడ్డాయి. అధిష్టానం ఒత్తిడి తాళలేక పోయారు. అరకొరగా ఆర్థిక వనరులున్న సరే సర్వశక్తులు ఒడ్డారు.
ఆయా నియోగాజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలను సైతం అగ్ర నేతలే నేరుగా పురమాయించారు. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమన్వయం కోసం ఇంచార్జి లను సైతం రంగంలోకి దించారు. మరో వైపు ఈసారి ప్రధాన పార్టీలు ఎక్కువగా సర్వే సంస్థల నివేదికల మీద ఎక్కువగా ఆధారపడ్డాయి.
అందుకే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అందరికి ఉత్కంఠ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ఏక పక్ష ఫలితాలు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీ చెరో రెండు సెగ్మెంట్లు గెలిస్తే బిఆర్ యస్ ఓకే సెగ్మెంట్ లో గెలిచింది. అందుకే లోకసభ ఎన్నిక ఫలితం తో అయిదు సెగ్మెంట్ లో ఎవరిదీ అధిపత్యమో తేలిపోతుంది. ఖచ్చితంగా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతాయనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
కీలక నేతల రాజకీయ భవిష్యత్తులో మార్పులు అనివార్యంగా చెప్తున్నారు. ఎలాగో పోటీ కాంగ్రెస్ బీజేపీ లమద్యే సాగింది. అయితే లోకసభ బరిలోకి దిగిన రెండు పార్టీల అభ్యర్థులు గెలిస్తే కేంద్ర మంత్రులవుతారనే చర్చే ఎక్కువగా సాగింది. సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచార సభల్లో నే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిస్తే ఇండియా సర్కార్ లో ఖచ్చితంగా మంత్రి అవుతారని భరోసా వ్యక్తం చేసారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తానూ ఎంపీ గా పోటీచేసి గెలవడం వల్లే రాజకీయ భవిష్యత్తు పూర్తిగా మారిపోయిందని రేవంత్ పదే పదే ఉదహరించారు. అందుకే ఆయన జీవన్ రెడ్డి ఎన్నికను చాల సీరియస్ గా తీసుకున్నారు. ఆయా సెగ్మెంట్ లలో ద్వితీయ శ్రేణి నేతలతోనూ ఆయనే అనేక సార్లు నేరుగా మాట్లాడి గట్టిగా పనిచేయలంటూ పురమాయించారు.
రేవంత్ దూకుడు చూసి తాము కూడా ఎంతో కొంత పనిచేయాలనే ఆలోచనకు వచ్చారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలా ఎవ్వరు ఫై నుంచి అడగలేదని వారు చెప్తున్నారు. మరో వైపు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడానికి గతంలో కన్న గట్టిగా పనిచేసారు. పార్టీ క్యాడర్ తో సంబంధం లేకుండా సొంత వ్యవస్థ ను ఆయా సెగ్మెంట్ లలో మోహరించి చాపకింద నీరులా పనిచేయించారు.
మోడీ మానియా మరింత ఉదృతం అయ్యేలా ఈ వ్యవస్థ పక్క కార్యాచరణతో పనిచేసింది. జీవన్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారంటూ రేవంత్ ప్రచారం చేసిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు కూడా అదే ఎత్తుగడ ను పాలో అయ్యాయి. ఎహే అర్వింద్ ఈసారి గెలిస్తే బీసీ కోట లో మంత్రి పదవీ పక్కా అందులోను బీజేపీ అభ్యర్థుల్లో ఆయనే భారీ మెజార్టీ వస్తుందంటూ సోషియల్ మీడియా వేదికల మీద ఉదరగొట్టేసారు.
అర్వింద్ కు మంత్రి పదవీ విషయంలో బాధనేతలెవ్వరూ మాటెత్తలేదు కానీ క్యాడరే విసృతంగా ప్రచారం చేసింది.ఫలితాలు రాకముందే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్లో ఎవరూ గెలిచినా కేంద్ర మంత్రి అవుతారంటూ అదే అజెండా ఎన్నికల ప్రచార ఘట్టం సాగింది. అదే జరిగితే జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులుంటాయి.