ఇది సంగతి: ఆర్మూర్: వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం సంబంధించి విత్తన కొనుగోళ్ల పైన అవగాహన సదస్సు ను రామన్నపేట్, కుకునూర్, అమీనాపూర్, పోచంపల్లి గ్రామాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ… రైతులు విత్తనాలు కొనే ముందు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు తీసుకోవాలని, విత్తన ప్యాకెట్ పైన సీడ్ కు సంబంధించి పరీక్ష చేసిన తేదీ, విత్తనం యొక్క కాల పరిమితి మరియు విత్తనాన్ని ప్యాకేసిన తేదీ ఉంటాయని వివరించారు.
విత్తనానికి సంబంధించిన మొలకెత్తు శాతం భీమశాతం లేబల్ పైన ఉంటాయని, రైతులు వాటిని పరిశీలించి విత్తనాలు కొనుక్కోవాలని సూచించారు. విత్తనాలు కొన్న డీలర్ దగ్గర నుంచి బిల్లు తప్పనిసరిగా రైతులు తీసుకొని జాగ్రత్తపరుచుకోవాలని.
నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈవోలు ప్రశాంత్, షబ్బీర్ మరియు రైతులు పాల్గొన్నారు.