ఆరు సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన మోపాల్ మండలం లో జరిగింది. బాలిక పినతల్లి చూడడంతో అనార్తం తప్పింది కానీ .
విషయం తెలిసిన బాలిక కుటింబీకులు లైంగికదాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేసారు . ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.పోలీసులు హుటాహుటిన వెళ్లి పరిస్థితి ని చక్కదిద్దారు మోపాల్ మండలంలో ఆరు సంవత్సరాల బాలికపైఅదే గ్రామానికి చెందిన యువకుడు చాక్లెట్ ఆశగా చూపి తన ఇంట్లోకి తీసుకుపోయాడు.విషయం తెలియక ఆతని వెంట వెళ్లిన చిన్నారి మీద లైంగిక దాడికి యత్నించాడు.
బాలిక ఆ ఇంట్లోకి వెళ్తుది గమనించిన చిన్నారి చిన్నమ్మ వెంటనే గట్టిగా అరవడంతో కేకలు యువకుడు పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు బంధువు లు ఇంటిని ధ్వంసం చేశారు. మోపాల్ పోలీసులు హుటాహుటిన వచ్చారు బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు