ప్రభుత్వ పాఠశాలలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను నేల పై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. దీంతో విద్యార్థులను నేలపై పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ సంఘటన నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.రేవంత్ పాలనలో విద్యాశాఖ పూర్తిగా దిగజారి పోయిందని బి ఎస్ ఎఫ్ ఐ ఆర్య ఎంపల ధ్వజమెత్తారు.
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠశాలలోనే నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నన్నారని మండిపడ్డారు.
ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
