Sunday, April 19, 2026
HomeLaw and Orderగాడితప్పిన సబ్ రిజిస్టర్ సమయపాలన..! సమయం 11 దాటినా పత్తాలేరు..అధికారుల కోసం ప్రజలు పడిగాపులు..

గాడితప్పిన సబ్ రిజిస్టర్ సమయపాలన..! సమయం 11 దాటినా పత్తాలేరు..అధికారుల కోసం ప్రజలు పడిగాపులు..

జిల్లాలో కీలకమైన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉన్నత అధికారులే విధులకు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

అధికారులు సమయపాలన పాటించకున్న అడిగేవారు ఎవరు లేకపోవడంతో సబ్ రిజిస్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. మా ఇష్టం వచ్చిన సమయానికి వస్తాం -వెళ్తాం మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అన్న తీరుగా ఇష్టానుసారంగా సబ్ రిజిస్టర్ వ్యవహరిస్తుండటం పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇష్టానుసారంగా సబ్ రిజిస్టర్ వ్యవహరిస్తుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్టర్లు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడంలేదనీ ప్రజలు అరోపణలు చేస్తున్నారు .

శనివారం ఉదయం 11 గంటలు దాటినా ఇద్దరు సబ్ రిజిస్టర్లు ఇతర ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పడిగాపులు కాశారు.

కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు అధికారుల కోసం పడిగాపులు వచ్చిన రైతుల కాశారు. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని వ్యక్తి వాపోయాడు. దీంతో అధికారుల పనితీరుపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కార్యాలయంలో అధికారి కోసం గంటలకొద్దీ నిరీక్షణ:

అధికారుల కోసం ప్రజలు కార్యాలయం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు.

పనుల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి సబ్ రిజిస్ట్రేషన్ అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!