HomeTelanganaNizamabadఅమర పోలీసు కుటుంబానికి అండ: రూ.కోటి చెక్కు అందజేసిన సీఎం..

అమర పోలీసు కుటుంబానికి అండ: రూ.కోటి చెక్కు అందజేసిన సీఎం..

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ఒక మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గత ఏడాది అక్టోబర్ 17న విధి నిర్వహణలో ఉంటూ మరణించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాన్ని సీఎం పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 కోటి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.

అలాగే ఇటీవల గంజాయి స్మగ్లర్ ల దాడిలో మృతి చెందిన గాజుల సౌమ్య కుటుంబానికి కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 కోటి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments