రాజ్యసభ ఎన్నికల్లోతన నామినేషన్ తిరస్కరణ ఫై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ధాఖలు చేసిన పిటిషన్ ను కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం కొట్టివేసింది. విచారణ సందర్భంగా మీనాక్షి తరఫున ప్రముఖ సీనియర్ అడ్వొకేట్, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వాదనలను చేసారు.
నామినేషన్ పత్రాల తిరస్కరణలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఏ తీర్పు అయినా ఉంటే చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ని ధర్మసనం కోరింది.
ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే దానిని పరిష్కరించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాల్సిందేనని, ఎన్నికల పక్రియ లో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.. కోర్టు ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని, తన క్లయింట్‌కు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని న్యాయవాది తెలిపారు. పూర్తి వాదనలు విన్న కోర్టు మీనాక్షి నటరాజన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.
