టాటా ఏసీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో బుదవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. సారంగాపూర్ కు చెందిన పల్లె సవిత(52) నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు దాటే క్రమంలో అటు వైపుగా వేగంగా అజాగ్రత్త వస్తున్న టాటా ఏసీ ఢీ కొట్టింది.
దీంతో సదరు మహిళను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.భర్త నర్సాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
