జీవితం పై విరక్తి చెంది యువకుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రూరల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..మారుతి నగర్ కు చెందిన విష్ణు(21). గత కొన్ని రోజులుగా పనులు చేయకుండా ఉంటున్నట్లు తెలిపారు.
దీంతో బుదవారం ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
