అతి వేగంగా, అజాగ్రత్త ఓ టాటా ఏసి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలో బుదవారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు…
నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి బడా బజార్ వైపు వెళ్తున్నా టాటా ఏసి వాహనం అటు వైపుగా బడా బజార్ నుంచి నెహ్రూ పార్క్ వైపు గా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, అలాగే అటు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొట్టి టాటా ఏసి బోల్తా కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
