నవిపేట్ లోని ప్రధాన రైల్వే గేటును మరమ్మతుల కోసం మూసివేయనునట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే గేటును మరమ్మతుల కోసం ఈనెల 26 నుంచి 30 వ తేది వరకు మూసివేయనునట్లు రైల్వే అధికారులు తెలిపారు.
నవీపేట నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్ళే వాహనదారులు కమలాపూర్, మహంతం, మోకన్‌పల్లి, గుండారం ద్వారా వెళ్ళాలని సూచించారు. అలాగే బాసర్ వైపు వెళ్తున్నా వాహనదారులు కల్యాపూర్, సాతాపూర్, తాడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా వెళ్ళాలని సూచించారు.
