కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం అయింది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర కు అప్పరావుపేట్ కు చెందిన సిరిగిలే ఎర్రన్న ప్రస్తుతం హైదరాబాద్ లోని లింగంపల్లి లో ఉంటున్నారు.
ఎర్రన్న తన అన్న కూతురైన మహి(7) నీ తీసుకొని హైదరాబాద్ నుంచి కామారెడ్డి కి వచ్చారు.తిరుగు ప్రయాణంలో కామారెడ్డి రైల్వే స్టేషన్ లో వచ్చే సరికి రైలు ఆలస్యం కావడంతో అక్కడే టికెట్ కౌంటర్ వద్ద పడుకున్నారు.
ఉదయం లేచి చూసేసరికి కనిపించక పోవడంతో చుట్టూ పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.ఎర్రన్న తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాగా మహీ రాలేదని చెప్పడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు. బాలిక ఎవరికైనా కనిపిస్తే 8712658591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
