HomeTelanganaNizamabadఅధికార పార్టీలో అర్బన్ ఫై వీడని పీటముడి .....పీసీసీ చీఫ్ మాటే చెల్లుబాటు కదా ?...

అధికార పార్టీలో అర్బన్ ఫై వీడని పీటముడి …..పీసీసీ చీఫ్ మాటే చెల్లుబాటు కదా ? క్యాడర్ లో తొలగని అనిచ్చితి ……..సేఫ్ గేమ్ ఆడుతున్న ద్వితీయ శ్రేణి నేతలు ……..

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనా పూర్తీ చేసింది అయినా సంస్థాగత వైఫల్యాలను అధిగమించలేక పోతుంది.ముఖ్య నేతల మధ్య ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు లో క్యాడర్ నలిగిపోతుంది. కానీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ కాసుల సంపాదన లో పడ్డారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్ మినహా మిగితా ఏడు నియోజకవర్గాల్లో నూ సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్టలో కి వెళ్ళింది. పార్టీలో ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులను చక్కదిద్దాల్సిన పీసీసీ నిస్సహాయ స్థితి లో ఉంది.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సొంత జిల్లా అయినప్పటికీ ఆయన గట్టిగా ఎవరిని గద్దించలేని దుస్థితి లో ఉన్నారు. ఎందుకంటే జిల్లాలో నిజామాబాద్ అర్బన్ ఆయన సొంత నియోజకవర్గం గా ఉంది కానీ అదే అర్బన్ లో పీసీసీ చీఫ్ మాట చెల్లు బాటు అయ్యే పరిస్థితి లేదు.

అర్బన్ పార్టీలో ఇంకా పీట ముడి వీడడం లేదు. ముగ్గరు సీనియర్ నేతలు ఎవరికీ వారే పాచికలు వేస్తున్నారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ తో పాటు మహేష్ కుమార్ లు సైతం అర్బన్ పార్టీ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరిమార్గనిర్దేశకం లో నడవాలో క్యాడర్ కు అంతు చిక్కడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ముగ్గురు నేతల వద్ద పాగా వేసి మంత్రాంగం నడిపిస్తున్నారు. గత పదేళ్ల కాలంగా అర్బన్ నేతలకు అండగా వుంటూ వచ్చిన బోధన్ ఎమ్మెల్యే ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు.

ఇప్పటిదాకా పదవులు దక్కిన నేతలందరూ ఆయన గుడ్ లుక్ లో ఉన్న వారే. పాలన వ్యవహారాలే కాదు పార్టీ లోనూ తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నారు. కానీ గత ఎన్నికలో ఓడిన వారే నియోజకవర్గాల ఇంచార్జ్ లు ఉన్నారు. పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో వారి మాటే చెల్లుబాటు కావాలనేది పార్టీ అధిష్టాన పెద్దల ఆదేశాలు.

దీనితో ఓడిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో పెత్తనం సాగిస్తున్నారు ఇందులో భాగంగానే అర్బన్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం పెత్తనం చెలాయించే పనిలో ఉన్నారు. కామారెడ్డి కి చెందిన అయన పూర్తీ స్థాయిలో అర్బన్ లో దృష్టి పెట్టలేక పోతున్నారు. మరో వైపు కామారెడ్డి లో రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

రేవంత్ ఎలాగో కామారెడ్డి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు అందుకే షబ్బీర్ అలీ నే కామారెడ్డి లో పెత్తనం నడిపిస్తున్నారు. దీనితో ఆయన రెండు నియోజకవర్గాల పగ్గాలు ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. కానీ మహేష్ కుమార్ ఎమ్మెల్సీ గా నియామకం అయ్యాక ఆయన తన ప్రోటోకాల్ ను అర్బన్ లోనే నమోదు చేసుకొని కార్పొరేషన్ లో ఎక్స్ ఆఫీషాయో సభ్యుడిగా అయ్యారు.

ఎహే ఇక షబ్బీర్ అలీ అర్బన్ లోకి జోక్యం చేసుకోరు సీఎం కు నాకు క్లియర్ మాట ఇచ్చారని మహేష్ సన్నిహితులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ గా కూడా నియామకం కావడంతో ఇక జిల్లాలో మహేష్ ఆధిపత్యం కు తిరుగుండదని పార్టీ వర్గాలు భావించాయి.

ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నా అర్బన్ లో ఇంకా షబ్బీర్, సుదర్శన్ రెడ్డి హవా ఇసుమెత్తు కూడా తగ్గలేదు. అసలు అర్బన్ పార్టీలో ఆయనకు బలమైన అనుచర వర్గమే లేకుండా పోయింది.ఉన్న ఒకరిద్దరు కూడా దిక్కులు చూస్తున్నారు.ఆయన వర్గీయులుగా ముద్ర ఉన్న నేతలెవ్వరికి పదువులు దక్కలేదు.

దీనితో పార్టీ లో ఆయన ప్రాబల్యం నామాత్రంగా మారింది. పదవుల పందేరంలో మహేష్ సైతం తన మాట చెల్లుబాటు అయ్యేలా పట్టుబట్టలేక పోయారనే టాక్ ఉంది. పీసీసీ అధ్యక్షుడయ్యాక కూడా ఆయన జిల్లాపార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అర్బన్ లోనే ముగ్గురు దిగ్గజ నేతలు ఎవరికీ వారే పెత్తనం సాగిస్తుండడంతో క్యాడర్ కు దిక్కు తోచడం లేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో రెండు మాసాల్లో జరగనున్నాయి.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో దిగ్గజ నేతల ఆధిపత్య పోరు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments