HomeEditorial Specialముంచుకొస్తున్న ...పర్యావరణ ముప్పు ........వరి కొయ్యలను కాల్చేస్తున్న వైనం ..... .....భూమి లో సహజ...

ముంచుకొస్తున్న …పర్యావరణ ముప్పు ……..వరి కొయ్యలను కాల్చేస్తున్న వైనం ….. …..భూమి లో సహజ పోషకాలు కోల్పోయేలా చేస్తున్నారు ….

వరి పంటల చేతికొచ్చేశాయి ధాన్యం మిల్లులకు చేరిపోయింది. పంట పొలాల్లో కోత మిషన్ సందడి తగ్గిపోయింది. యాసంగి పనులు మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది.

అయితే ఎప్పటిలాగే వరి పంట ను ఈసారి కూడా యంత్రాలతో కోసిన రైతులు పొలాల్లో మిగిలిన వరి కొయ్యలకు నిప్పు పెట్టి తదుపరి పంట కోసం భూమి బాగు చేసుకునే పనిలో ఉన్నారు.

ఈ సాంప్రదాయ విధానాలు పర్యావరణ ఫై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని వ్యవసాయ నిపుణులు పదే పదే చెప్తున్నారు. ఢిల్లీ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రలను ఇలాంటి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్.

సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానం సైతం పంట వ్యర్థాలను కాల్చడాన్ని ఆక్షేపించింది. కాల్చకుండా ఆ భూమి ని పున:సంస్కరణలు చేసుకోవడం వల్ల భూమి ఆరోగ్యం మెరుగు పడేలా, పర్యావరణ పరిరక్షణ ఉండేలా చేస్తోంది.

వరి గడ్డి పెరిగేందుకు నత్రజని, భాస్వరం, పొటాశ్, సూక్ష్మ పోషకాలను తీసుకుంటుంది. తిరిగి ఈ కొయ్యలను నేలలో కలపడం ద్వారా సేంద్రియ పదార్థాలుగా మారి భూసారాన్ని పెంచుతాయి. వరి కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నడం వల్ల వరి అవశేషాలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇలా చేయడం వల్ల నేలలో పగుళ్లు రావడం, తేమ ఆవిరి కావడం తగ్గుతోంది. వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేసేందుకు ముందు దమ్ము వేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్పేట్ వేయడం వల్ల కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి.

దీంతో దిగుబడి సైతం 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు…….వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. నేలలో ఉన్న పోషకాలు ఆవిరైపోతాయి. వాయు కాలుష్యం ఏర్పడుతోంది. జీవవైవిధ్యం, నీటి నిల్వలు తగ్గిపోతాయి.

భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత తగ్గించాలన్నా, నేలలో కర్బన శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకే చేర్చడం ఉత్తమమైన పద్ధతి. ఇకపోతే వరి అవశేషాలను కాల్చకుండా కంపోస్టు తయారీలో ఉపయోగించుకోవచ్చు.

పశువుల మేతకు వాడుకోవచ్చు. వరి కొయ్యలను కాల్చవద్దని, త ద్వారా పర్యావరణం, భూసారానికి హాని కలుగుతుంది——-కాల్చడం వల్ల నష్టాలు..నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయి.

తద్వారా భవిష్యత్ పంటల కోసం అందుబాటులో ఉండవు. వాయు కాలుష్యం.. కాల్చడం వల్ల వాయు మాలిన్యం ఏర్పడి ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుంది. కీటకాల పెరుగుదల… తగలబడకుండా ఉన్న అవశేషాలు, కీటకాలు వ్యాధులకు నివాసాలుగా మారతాయి.

జీవ వైవిధ్యం తగ్గడం.. మట్టిలోని సూక్ష్మజీవాలు దెబ్బతిని భూమి సంతులనం కోల్పోతుంది. నీటి నిల్వ తగ్గడం.. కాల్చడం వల్ల మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భవిష్యత్ పంటలకు ఎక్కువ నీటి అవసరం ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments