HomeCRIMEకామారెడ్డి కొనసాగుతున్న ఉద్రిక్తలు .......యదావిధిగా పోలీసు .......కామారెడ్డి రాకుండా బీజేపీ చీఫ్ అరెస్ట్

కామారెడ్డి కొనసాగుతున్న ఉద్రిక్తలు …….యదావిధిగా పోలీసు …….కామారెడ్డి రాకుండా బీజేపీ చీఫ్ అరెస్ట్

ఆంక్షలు కామారెడ్డి లో శనివారం తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయ్. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణా రెడ్డి ఇంటివద్ద పోలీసుల పహారా కొమసాగుతుంది పలువురు బీజేపీ అగ్ర నేతలు ఆదివారం కామారెడ్డి రావడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో రాజకీయ అలజడులు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ తార్నాక నుంచి  కామారెడ్డికి బయలు దేరిన బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ను  అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తార్నాకలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అరెస్టుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు కామారెడ్డిలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పరిసరాల్లో  పోలీసుల ఆంక్షలు విధించారు. ఆదివారం  బీజేపీ బృందం పర్యటన ఉన్న క్రమంలో  అప్రమత్తమైనపోలీసులు పలువురిని హౌస్ అరెస్టు చేశారు.

ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ గా పోలీసుల మోహరించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు, షబ్బీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

అలాగే బాన్సువాడ వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నుమెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీసులు  అరెస్ట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే యెండల ను సైతం పోలీసులు బాన్స్ వాడ వెళ్లకుండాశివారు ప్రాంతం లో అదుపులోకి తీసుకోని నిజామాబాద్ తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments