పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో క్విడ్ ప్రొ కో లో భాగంగా తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్ కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చాడు.
ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా?ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా మళ్లీ పట్టించుకోవటం లేదు.
188 కోట్లు పెట్టి కేటీఆర్ ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ ను కొనుగోలు చేశాడు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్ లో అతి పెద్ద అవినీతి అనకొండ గుంటనక్కనే. పాలమూరు ప్రాజెక్ట్ కు కూడా అన్యాయం చేసింది ఆ గుంటనక్కనే.
ఎవరైతే అవినీతి చేశారో ఆయననే ముందు పెట్టి కాళేశ్వరం అంశాన్ని ఈ ప్రభుత్వం మాట్లాడిస్తోంది. మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 14 వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా?మీ పార్టీలో అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేసారు నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేదే లేదు. చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లను మా నిజామాబాద్ లోకి రానివ్వలేదు. ఉద్యమకారులకు, తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేందుకు ఫైట్ చేశాను. కానీ ఇవ్వాళ హరీష్ రావు మాత్రం నారాయణ, చైతన్య సంస్థలకు పాలు అమ్ముకుంటున్నాడు..
తిన్నది సరిపోతలేదని ఇంకా మూడు నెలల పాటు పదవి కావాలని హరీష్ రావు అడుగుతున్నాడని పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోతలేదా? ఆమె మండి పడ్డారు మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల ద్వారా కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి పోసుకోవచ్చు.కానీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆమె మండి పడ్డారు ఖమ్మంలో రైతు సభ జరిగే లోపు మహబూబ్ నగర్ లో రైతులపై పెట్టిన కేసులు, రౌడీ షీట్లను తొలగించాలి.
