Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadరాజ్యాంగం కల్పించిన కార్మిక వర్గ హక్కులనుకాలరాస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-BLTU...

రాజ్యాంగం కల్పించిన కార్మిక వర్గ హక్కులనుకాలరాస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-BLTU రాష్ట్ర అధ్యక్షులు — దండి వెంకట్

అంతర్జాతీయ శ్రామిక వర్గ మేడే దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోబహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU ఆధ్వర్యంలో ఆ యూనియన్ నాయకులు నగరంలో 26 చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా సుభాష్ నగర్ లో గల బహుజన కమ్యూనిస్టు (బిఎల్ పి) జిల్లా కార్యాలయం వద్ద సుత్తి కొడవలి అశోక చక్రంతో కూడిన పార్టీ జెండాను , మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన బిఎల్ టీయూ కార్మిక జెండాను దండి వెంకట్ ఆవిష్కరించారు .

శివాజీ నగర్ లో గల బహుళజన బీడీ కార్మిక సంఘం కార్యాలయం వద్ద బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ‌సిద్ది రాములు, ఫూలే అంబేడ్కర్ నగర్ కాలనీలో బహుజన కమ్యూనిస్టు పార్టీ జెండాను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత ఆవిష్కరించారు.

నగరం లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల అనంతరం శివాజీ నగర్ లో జరిగిన మేడే బహిరంగ సభలో దండి వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 కోడ్ లు తెచ్చి భారత బహుజన కార్మిక వర్గాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నందని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ‌సిద్ది రాములు మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల పరిశ్రమ సంక్షోభంతో దేశవ్యాప్తంగా పరిశ్రమపై ఆధారపడిన 10 కోట్ల మంది బీడీ కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సబ్బని లత మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు 90% బహుజన శ్రామిక వర్గ మహిళలేన మహిళల అభివృద్ధి కోసం పాటుడుతున్నామని ప్రగల్భాలు పలికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా కార్మికుల శ్రమ దోపిడికి పాల్పడే పెట్టుబడిదారలకు వత్తాసు పలుకుతున్నారని ఆమె విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిఎల్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు టి.రాజ్ కుమార్, నగర అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ కుమార్, గంగా శంకర్వాటర్ సెక్షన్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్, హరిష్, శానిటేషన్ జవాన్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్ స్వామి, ప్రవీణ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, ఎల్లయ్యబహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీనియర్ నాయకులు ఆర్. మురళి, శ్రీశైలం, వసంత్, మోహన్ గౌడ్, అబ్బాపూర్ సాయిలు , బీడీ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!