ప్రైవేట్ యాజమాన్యం సహకారంతో చిట్టిల పేరుతో మోసం చేస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ 6వ టౌన్ లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్ ప్రయివేటు చీటీల యాజమాన్యం సహకారంతో కలిసి 4 నుండి 5 చీటీలు వేసి మోసపూరితంగా తన తోటి సిబ్బందిని,మిత్రులను గ్యారంటీరులుగా పెట్టి మోసం చేశారని తెలిపారు.
అలాగే ఆ చిట్టీలకు సంబంధించిన మొత్తం డబ్బులను తీసుకొని కట్టక పోగా తనకు మాత్రం ఎటువంటి రికవరీలు కాకుండా జాగ్రత్తలు పడుతూ తన మిత్రులకు తన తోటి సిబ్బందికి మాత్రమే మోసపూరితంగా రికవరీ అయ్యేవిధంగా చేసినందులకు 4వ టౌన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అదే విధంగా కోర్టు లో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్ తాత్కాలిక ప్రాపర్టి రిలీజ్ కేసులలో పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించి, వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు తేలడంతో 6వ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యాయని తెలిపారు.
